🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2026, 6:12 pm Posted by : Nagilla Rajinikanth

దీక్షా దివస్ సభకు తరలిన మల్లారం బీఆర్ఎస్ శ్రేణులు

News Image
భీమదేవరపల్లి, నవంబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా నిర్వహించిన దీక్షా దివస్ సభకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు చింత రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని, కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
🏠 Home