పురుగుల మందు కలిసిన గడ్డి మేసి 35 జీవాలు మృతి..
ముఖ్యమైన పాయింట్స్:సరుగుడు తోటలో విషాదం.. కాపరుల కన్నీరుమున్నీరు..మృతిచెందిన జీవాలకు పరిహారం అందించాలని బాధితుల వేడుకోలు.. పాతపట్నం, సెప్టెంబర్ 28 సిక్కోలు గర్జన న్యూస్: వంశధార జలాశయం ఎగువ ప్రాంతంలోని సరుగుడు తోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు పిచికారీ చేసిన గడ్డి, సరుగుడు ఆకులను మేయడంతో సుమారు 20 గొర్రెలు, మేకలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జీవాలు మృత్యువాత పడటంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న కాపరులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు ఆదివారం తమ జీవాలను మేత కోసం సమీప ప్రాంతాలకు తోలుకెళ్లారు. ఈ క్రమంలో వంశధార...