మైనింగ్‌లో ‘సంజీవ’ మాయాజాలం?
సూర్యాపేట, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా మైనింగ్ శాఖలో కొంతకాలంగా ఒక తాత్కాలిక డ్రైవర్ చుట్టూ పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలకోట్ల సంజీవ అనే వ్యక్తి మైనింగ్ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ శాఖ కార్యకలాపాల్లో తన పరిధికి మించి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజు వాహనాల నిర్వహణ, ఇసుక రవాణా, ఎస్‌ఆర్‌ఓల తనిఖీలు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ వంటి అంశాల్లో ఆయన పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా మైనింగ్ శాఖకు సంబంధించిన వాహనాల వినియోగం, వాటి లాగ్‌బుక్స్, బిల్లులు, ఇసుక రవాణా వివరాలు, ఆన్‌లైన్ బుకింగ్...