హుజూర్ నగర్ రెవెన్యూ 214 సర్వే నంబర్‌పై ఆక్రమణల ఆరోపణలు

హుజూర్‌నగర్‌, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 214లో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ స్థానికులు, ప్రజా సంఘాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి భూమి హద్దులను అధికారికంగా నిర్ధారించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కంటు నాగరాజు కోరారు. స్థానికుల వివరాల ప్రకారం.. గతంలో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సమయంలో 1983లో మహిళల సౌకర్యార్థం సులభ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి ఆక్రమణల ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో పాత భూ రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయాలని కంటు...