ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమి.. కబ్జాదారులపై చర్యలేవి?
నడికూడ, అక్టోబర్ 04, 2026 (ప్రజానేస్తం జ్వాల): నడికూడ గ్రామ శివారులోని సర్వే నంబర్ 525/1లో ఉన్న ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతోందని ఎర్రమ్మ తల్లి గుట్ట పరిరక్షణ సమితి ఆరోపించింది. ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, మతపరమైన నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయని సమితి పేర్కొంది.ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులకు రెండు నెలల క్రితమే రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని సమితి ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే స్థలాన్ని పరిశీలించి, రికార్డుల ఆధారంగా భూమి హద్దులను నిర్ధారించి, ఆక్రమణలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.అధికారుల స్పందన...