బీసీ హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు అవసరం
📌 హైదరాబాద్ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను విస్తృతం చేయాలి హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై మహాసభలో చర్చించారు. బీసీలకు రాజ్యాంగపరంగా లభించాల్సిన హక్కులు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం తదితర అంశాలపై మరింత సమర్థవంతమైన ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం...