ప్రొద్దుటూరులో జల్‌ జీవన్‌ మిషన్‌కు శ్రీకారం

📌 రూ.30 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు కడప, అక్టోబర్‌ 4( ప్రజానేస్తం జ్వాల): కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్టోబర్‌ 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో రూ.30,156 కోట్ల వ్యయంతో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11.20 గంటలకు జల్‌ జీవన్‌ మిషన్‌ పైలాన్‌ను ఆవిష్కరించి అనంతరం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పాల్గొననున్నారు.గ్రామీణ నీటి సరఫరా,...