బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చివరి కసరత్తు
📌 నల్లగొండ–ఖమ్మం–వరంగల్ నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. దసరాలోపు ప్రకటన హైదరాబాద్, అక్టోబర్ 4(ప్రజానేస్తం జ్వాల): రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఈ స్థానానికి మన్నే క్రిశాంక్, కాసాని వీరేష్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకుని దసరాలోపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.