ఢిల్లీ కోటాలో సేవారత్నం అవార్డు అందుకున్న పిల్లుట్ల రఘును గరిడేపల్లి మండల కేంద్రంలో ఘనంగా సన్మానిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు.
📌 ఆరేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు గరిడేపల్లి, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో గత ఆరు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘుకు ఢిల్లీ కోటాలో డాక్టర్ సేవారత్నం అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.పిల్లుట్ల రఘు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శాలువా కప్పి,...