భద్రాచలంలో సామూహిక భజన కార్యక్రమం
📌 శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో సామూహిక భజన నిర్వహిస్తున్న కీతవారిగూడెం శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ భజన బృందం సభ్యులు. భద్రాచలం, అక్టోబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శ్రీరామదాసు సేవా సొసైటీ అధ్యక్షులు శ్రీశ్రీ మాన్యపు సిద్ధేశ్వర స్వామి వారి ఆదేశాల మేరకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు కావడంతో, ఆ నక్షత్రం వచ్చిన రోజున కల్యాణం మరియు సామూహిక భజన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కీతవారిగూడెం గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ భజన బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంత భజనలు నిర్వహించారు. ఉదయం వేళ భక్తులు శ్రీరామ నామస్మరణతో ఆధ్యాత్మిక...