కీతవారిగూడెంలో గ్యాస్ సిలిండర్ చోరీ .. పోలీసులకు సమాచారం.
ఇంటి యజమాని చాకచక్యంతో ఇద్దరు దొంగలను పట్టివేత కీతవారిగూడెం, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):కీతవారిగూడెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ చోరీకి పాల్పడ్డారని అనుమానం తో ఇద్దరు యువకులను ఇంటి యజమాని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన చలిగంటి శివ ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ చోరీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో నివాసం ఉంటున్న ఆంధ్రా కు చెందిన గుడివాడ పెద్ద ఉప్పి, గుడివాడ సాయి అనే ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వారిని గుర్తించి పట్టుకున్నట్లు శివ తెలిపారు.వీరికి గతంలో కూడా రోడ్డుపై ఉన్న మోటార్‌సైకిళ్లు, ఇనుప సామగ్రి తదితర వస్తువుల చోరీలకు...