క్షయ రహిత గ్రామంగా రసూల్‌పల్లి

టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో గుర్తింపు భీమదేవరపల్లి, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్‌పల్లి గ్రామం క్షయ రహిత గ్రామంగా ఎంపికైంది. టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని డిప్యూటీ కలెక్టర్ రవి చేతుల మీదుగా రసూల్‌పల్లి సర్పంచ్ బోయిని మహేష్ అందుకున్నారు.మండలంలో రసూల్‌పల్లితో పాటు మరో ఆరు గ్రామాలు క్షయ రహిత గ్రామాలుగా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థాయిలో క్షయ వ్యాధి నివారణ, గుర్తింపు, చికిత్సపై చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అప్పయ్యతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు...