కీతవారిగూడెం గ్రామంలో 33 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
మిగిలిన 37 మంది లబ్ధిదారులకు త్వరలో అందజేస్తాం: ఎస్కే చాంద్ మియా కీతవారిగూడెం, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 33 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే చాంద్ మియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా చాంద్ మియా మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కీతవారిగూడెంలో మొత్తం 70 కుటుంబాలకు...