హనుమకొండలో సైబర్ భద్రతా పాఠాలు.. 2,500 మంది విద్యార్థులకు అవగాహన
భీమారం, హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ నరసింహరావు ఆధ్వర్యంలో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం ఎస్‌వీఎస్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేయూసీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. రవికుమార్, ఎస్‌ఐ శ్రావణితో పాటు ఇతర ఎస్‌ఐలు పాల్గొన్నారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 2,500 మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్...