పరకాల వాసికి రాష్ట్రస్థాయి గుర్తింపు.. గవర్నర్ చేతుల మీదుగా సత్కారం
ప్రజానేస్తం జ్వాల | ప్రత్యేక ప్రతినిధి పరకాల: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) అమలులో ప్రతిభ కనబరిచిన పరకాలకు చెందిన కొలుగూరి రవీందర్ రావుకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. 2026 అక్టోబర్ 9న గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆయన స్పెషల్ కేటగిరీ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం కొలుగూరి రవీందర్ రావు రామగుండం తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో ఆయన కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజలకు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చట్టం అమలులో ప్రతిభకు...