కీతవారిగూడెంలో నకిలీ ఫోన్‌పేతో మోసం!

రూ.9,500 విలువైన సిగరెట్లు కొనుగోలు చేసి మాయమైన ఇద్దరు వ్యక్తులు దుకాణంలో మహిళలే ఉండటాన్ని ఆసరాగా చేసుకున్నట్లు సమాచారం.. పోలీసుల విచారణ గరిడేపల్లి, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో నకిలీ ఫోన్‌పే చెల్లింపుతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.9,500 విలువైన సిగరెట్లు కొనుగోలు చేసి, నకిలీ ఫోన్‌పే చెల్లింపు ద్వారా దుకాణదారులను మోసం చేసినట్లు తెలిసింది. దుకాణంలో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు...