ఇసుక మాఫియాను మించిన ఇటుక బట్టీల దందా
సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 8 (ప్రజానేస్తం జ్వాల):తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా.. సూర్యాపేట జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చని పంట పొలాల మధ్య బట్టీల మంటలు, ఆకాశాన్ని కమ్మేస్తున్న పొగ, భారీగా మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత వంటి అంశాలు పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.“బట్టీలు బగ్గు.. పర్యావరణం, భవిష్యత్తు బుగ్గి” అన్నట్లుగా పరిస్థితి మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాల్లో నల్లని పొగ ఇటుకల తయారీ కోసం పంట భూముల నుంచి మట్టి...