కాన్షిరామ్ ఆశయ సాధనే లక్ష్యం.. బహుజన రాజ్యాధికారమే ధ్యేయం!
కొత్తకొండ, అక్టోబర్ 9 (ప్రజా నేస్తం జ్వాల): బహుజనుల ఐక్యతే బలం.. రాజకీయ అధికారమే లక్ష్యం.. కాన్షిరామ్ ఆశయాల సాధనే మనందరి కర్తవ్యం అని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ పిలుపునిచ్చారు. బహుజన సిద్ధాంతకర్త, సామాజిక న్యాయ సాధకుడు, బహుజన ఉద్యమ మార్గదర్శి మాన్యవర్ కాన్షిరామ్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆయన అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతి కార్యక్రమంలో ప్రకాష్ పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. “ఓట్లు మావి.. సీట్లు మీవా?”...