ఏకేవీఆర్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
భీమదేవరపల్లి, అక్టోబర్ 9 (ప్రజా నేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ముల్కనూర్‌లోని ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు విద్యార్థినుల కోలాహలం, సంప్రదాయ ఆటపాటలతో కన్నుల పండువగా సాగాయి. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో విద్యార్థినులు కళాశాల ప్రాంగణాన్ని పూలవనంగా మార్చారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సంబరాలు చాటిచెప్పాయి. విద్యార్థుల్లో సాంస్కృతిక...