బిట్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాల సందడి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం!
📌 పూల పండుగతో కళకళలాడిన పాఠశాల ప్రాంగణం – విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యమే లక్ష్యం: ప్రిన్సిపాల్ సంజయ్ కుమార్ (ప్రజా నేస్తం జ్వాల): పరకాల (ప్రజానేస్తం జ్యాల): హనుమకొండ జిల్లా, పరకాల పట్టణంలోని బాలాజి విద్యాసంస్గల పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను బిట్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పూల పండుగ విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను...