ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.. పోలీసు సిబ్బందికి వరంగల్‌ సీపీ ఎన్‌. శ్వేతా సూచన భీమదేవరపల్లి, అక్టోబర్‌ 9 (ప్రజానేస్తం జ్వాల):ప్రజలకు మర్యాదపూర్వకంగా సేవలందిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేతా, ఐపీఎస్‌ పోలీసు సిబ్బందికి సూచించారు.వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె ముల్కనూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధార కవిత పూల మొక్కను అందజేసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం ముల్కనూర్‌ ఎస్‌ఐ ఎం. రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సీపీకి గౌరవ వందనం సమర్పించారు.తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసులు,...