సర్వారం ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంజన్‌రెడ్డి గరిడేపల్లి, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల):సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలోని ఎంపీయూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేందుకు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాలల్లో తగిన వసతులు ఉంటే విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడటంతో పాటు వారి ఆరోగ్యం,...