కేసీఆర్‌పై అవమానకర చర్యలు కాంగ్రెస్‌ పతనానికి నాంది: చల్లా ధర్మారెడ్డి పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ

హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించే చర్యలు కాంగ్రెస్‌ పార్టీ పతనానికి నాంది పలుకుతాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పోరాడి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడిని కించపరిచేలా వ్యవహరించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ జిల్లాల ఏర్పాటు దశాబ్ది సందర్భంగా శనివారం హనుమకొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో...