కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా కార్యవర్గం ప్రకటన

ఆసిఫాబాద్‌, అక్టోబర్‌ 10 (ప్రజానేస్తం జ్వాల) : కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి మైనార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మైనార్టీ సెల్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా మైనార్టీ సెల్‌ చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌తో కలిసి కార్యవర్గ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ పార్టీలో మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత...