వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 35 మంది ఎస్‌ఐల బదిలీ

వరంగల్, అక్టోబర్ 10: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనా కారణాలతో 35 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను (ఎస్‌ఐలు) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి సీ.నెం. 12/A1-Estt/2026, సీ.ఓ. నెం. 9387/2026 ఉత్తర్వుల మేరకు ఈ బదిలీలు చేపట్టారు. హనుమకొండ, పరకాల, దేవరుప్పుల, పాలకుర్తి, ధర్మసాగర్, వంగర సహా పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐల స్థానాలు మారాయి. ముఖ్యమైన బదిలీలు ఇవే.. బండి శ్రవణ్ కుమార్: లింగాల ఘణపురం నుంచి చిల్పూర్‌కు. సిరిపురం నవీన్ కుమార్: చిల్పూర్ నుంచి...