ఓరుగల్లులో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చారిత్రక ఓరుగల్లు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్‌, హనుమకొండ నగరాల్లో ఎటుచూసినా రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, నగర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు....