మా డిమాండ్ నెరవేరే వరకు పోరాటం ఆగదు

వరంగల్ (ప్రజానేస్తం జ్వాల): తమ డిమాండ్లు నెరవేరే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో పోలీసులు తమను నిర్బంధించారని ఆరోపించారు. శనివారం వరంగల్‌కు చేరుకున్న వారు మీడియా సమావేశంలో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. CJP ప్రతినిధులు స్టాన్లీ కొరాని, రంగా సాయి రెడ్డి, రాజేష్ కొరపాక, వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భోపాల్ సమీపంలో పోలీసులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్నప్పటికీ తమ నిరసనను కొనసాగిస్తూ 24 గంటల పాటు నిరాహార...