కాకతీయ రాతికోట వద్ద మద్యం సీసాలు కలకలం

చారిత్రక కట్టడం పరిసరాల్లో పరిశుభ్రత, భద్రతపై ప్రశ్నలు వరంగల్, ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి:ఓరుగల్లు చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ రాతికోట ప్రవేశ ద్వారం సమీపంలో మద్యం సీసాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. చారిత్రక కట్టడాన్ని సందర్శించే పర్యాటకులు, స్థానికంగా నడకకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాతికోట ప్రవేశ ద్వారం కుడివైపు మద్యం సీసాలు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అక్కడి నిర్వహణ, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే, ఆ సీసాలను ఎవరు అక్కడ ఉంచారు, అక్కడ మద్యం సేవించారా అనే విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు సంబంధిత...