ఎండిన బోర్లకు పునర్జీవం.. భూగర్భ జలాల పెంపునకు బోర్ రీఛార్జ్ పనులు ప్రారంభం
వేలేరు, అక్టోబర్ 14 (ప్రజా నేస్తం జ్వాల): భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా వేలేరు మండల కేంద్రంలో బోర్ రీఛార్జ్ పనులను ప్రారంభించారు. VBG-RAM-G పథకంలో భాగంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎండిపోయిన బోర్లకు తిరిగి జీవం పోసేందుకు చేపట్టిన ఈ పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, మండల ఎంపీడీవో కిషన్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంపీడీవో కిషన్ నాయక్ మాట్లాడుతూ, భూగర్భ జలాల వినియోగం పెరగడం, వర్షపాతం లోపించడం వంటి కారణాలతో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు...