విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం
ముఖ్యమైన పాయింట్స్:టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 485 సబ్స్టేషన్లలో పనులు.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎండీ ఆదేశాలు హనుమకొండ, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసి, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని పాత విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణ, సమగ్ర మరమ్మతు పనులను వేగవంతం చేసినట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సంస్థ పరిధిలోని 17 సర్కిళ్లలో మొత్తం 485 పాత విద్యుత్ సబ్స్టేషన్లలో ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నాటికి 145 సబ్స్టేషన్లలో సివిల్ పనులు, మరో 65 ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ పనులు...