బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ, ప్రజానేస్తం జ్వాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో జరుపుకునేలా నగరవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. పండుగకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం కమిషనర్ చిన్నవడ్డేపల్లి, బేస్తం, ఉర్సు, బంధం చెరువులతో పాటు పద్మాక్షి గుండం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. పారిశుధ్యం, భద్రతకు ప్రాధాన్యం చెరువుల ఘాట్ల వద్ద...