రూ. కోటి వ్యయంతో భద్రకాళి అమ్మవారి దివ్య రథం సిద్ధం
హనుమకొండ, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల విరాళాలతో దాదాపు రూ. కోటి వ్యయంతో రూపొందించిన 30 అడుగుల భారీ దివ్య రథం సిద్ధమైంది. ఎనిమిది నెలల పాటు శ్రమించి, రథాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంతటి ఎత్తైన రథాన్ని నిర్మించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. భక్తుల విరాళాలతో అద్భుత రథ నిర్మాణం భద్రకాళి అమ్మవారి రథోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా నిర్వహించాలనే సంకల్పంతో భక్తుల సహకారంతో ఈ భారీ రథాన్ని రూపొందించారు. సంప్రదాయ ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా రథాన్ని తీర్చిదిద్దడం...