యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, అక్టోబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): పరకాల పట్టణంలోని రాజుపేటలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా, వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యారంగ...