రేపు గట్లకానిపర్తి, పోచారం ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
శాయంపేట, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు సంబంధించి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (అక్టోబర్ 15) గట్లకానిపర్తి సబ్స్టేషన్ పరిధిలోని రెండు ఫీడర్లలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్ శాయంపేట అసిస్టెంట్ ఇంజనీర్ మాసు చొక్కా రావు తెలిపారు. గట్లకానిపర్తి ఇండస్ట్రియల్ ఫీడర్, పోచారం ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విద్యుత్ అంతరాయం కారణంగా ఆయా ఫీడర్ల పరిధిలోని వ్యవసాయ, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు రైతులు, మిల్లర్లు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరమ్మతుల పనులకు సహకరించి,...