మోదీ జన్మదినం సందర్భంగా మానసిక దివ్యాంగులకు అన్నదానం
సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కోదాడలో సేవా కార్యక్రమం కోదాడ, ప్రజానేస్తం జ్వాల: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా సూర్యాపేట జిల్లా బీజేపీ దివ్యాంగుల సెల్ కన్వీనర్ ఏమిరెడ్డి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలోని శనగల రాధాకృష్ణ ట్రస్ట్లో మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోదీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మానసిక దివ్యాంగుల కోసం అన్నదానం నిర్వహించిన శంకర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, దివ్యాంగుల సెల్...