పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

పోష్ చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: డాక్టర్ అనితా రెడ్డి హనుమకొండ, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల):పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోష్ కమిటీ కన్వీనర్ డాక్టర్ అనితా రెడ్డి హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించడం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి సంస్థ యాజమాన్యం బాధ్యత అని స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండలోని సుబేదారిలో ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013’ (పోష్ చట్టం)పై నిర్వహించిన అవగాహన, సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలకు భద్రమైన పని వాతావరణం కల్పించాలి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మహిళా...