రైతులకు అండగా వ్యవసాయ యాప్లు.. చీడపీడల గుర్తింపు నుంచి మార్కెట్ ధరల వరకు సమాచారం
కీతవారిగూడెంలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థుల అవగాహన కార్యక్రమం కీతవారిగూడెం, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైతులు మెరుగైన దిగుబడులు సాధించేందుకు మొబైల్ యాప్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఏలూరులోని సీహెచ్ఎస్డీ సెయింట్ థెరిసా మహిళా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో రైతులకు వివిధ వ్యవసాయ మొబైల్ యాప్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పంటలను ఆశించే చీడపీడలను గుర్తించడం, తెగుళ్ల నివారణ, వాతావరణ సమాచారం, పంటల నిర్వహణ, మార్కెట్ ధరల వివరాలను తెలుసుకోవడంలో వ్యవసాయ యాప్ల ప్రాధాన్యతను విద్యార్థులు వివరించారు. చీడపీడల గుర్తింపునకు ప్రత్యేక యాప్లు జాతీయ స్థాయి కీటకాలు,...