636 మంది భూభారతి ఎఫ్టీఎస్ ఉద్యోగుల కొనసాగింపునకు డిప్యూటీ సీఎం సానుకూల హామీ
ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాల సమస్యలను పరిష్కరించాలని వినతి ప్రజానేస్తం జ్వాల:తెలంగాణ రాష్ట్రంలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 636 మంది భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (FTS) ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర భూభారతి FTS సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఉద్యోగుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై వినతి రాష్ట్రంలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న FTS ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులను యథావిధిగా కొనసాగించడం,...