ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

మెదక్, ప్రజానేస్తం జ్వాల:మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్ మండలం దండువానికుంట తండాలో చోటుచేసుకుంది. మృతుడు విస్లావత్ అనిల్‌గా గుర్తించారు.అందిన సమాచారం ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేసే సమయంలో రైతు అనిల్ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ సిబ్బంది సమక్షంలోనే రైతు ట్రాన్స్‌ఫార్మర్‌పై పని చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. లైన్‌మెన్ దగ్గరుండి రైతుతో మరమ్మతులు చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యుత్ సిబ్బందిపై కుటుంబ సభ్యుల ఆగ్రహం రైతు మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...