వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

భీమదేవరపల్లి, అక్టోబర్ 14 (ప్రజా నేస్తం జ్వాల):మెదక్ పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మహనీయుల విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. మంగళవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు సమీపంలో, చేగుంట–హైదరాబాద్, నర్సాపూర్–హైదరాబాద్ ప్రధాన రహదారుల కూడలి వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహాన్ని...