తూర్పుకోటలో బతుకమ్మ ఏర్పాట్లపై అఖిలపక్ష నాయకుల పరిశీలన
ఖిలా వరంగల్, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి బొలుగొడ్డు అమృత్ వర్మ): బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఖిలా వరంగల్ తూర్పుకోటలో బతుకమ్మ ఆట స్థలాన్ని, నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించి, పండుగ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆడే ప్రదేశంలో తాగునీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, తగినంత లైటింగ్ ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. అలాగే బతుకమ్మ నిమజ్జన స్థలాన్ని సందర్శించి, పండుగకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...