నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వేలేరు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

వేలేరు, అక్టోబర్‌ 15 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాలోత్ శ్రీను): వేలేరు మండల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ దుదిమెట్ల నరేష్‌ను మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి సంపత్‌ ఎస్‌ఐ నరేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కత్తి సంపత్‌ మాట్లాడుతూ వేలేరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో సమర్థవంతమైన చర్యలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు మరింత మెరుగైన...