వంగర నూతన ఎస్సైగా ఎం. రాజు బాధ్యతల స్వీకరణ
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి రజినికాంత్): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎం. రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై ఎం. రాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు. కాగా, ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో వంగర ఎస్సైగా విధులు నిర్వహించిన దివ్య హనుమకొండ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఎం....