నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పగ్గాలు రంగినేని స్పందన రాజీవ్‌కు
నేరేడుచర్ల, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని రైతులకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల సందడి, నాయకులు, కార్యకర్తల హాజరుతో ఉత్సాహభరితంగా సాగింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 17 మంది సభ్యులతో కూడిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించారు. రెండు మండలాలకు చెందిన...