108 అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలి
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): అత్యవసర వైద్య పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా 108 అత్యవసర సేవల మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించడంలో 108 సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం భీమదేవరపల్లి మండలంలో నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ను ఆయన తనిఖీ చేశారు. అంబులెన్స్లోని వైద్య పరికరాలు, నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 756 మంది ప్రాణాలను కాపాడటంలో సేవలందించిన సిబ్బందిని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయండి ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ శ్రీనివాస్...