ఉపాధి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ తనిఖీ
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా వేతన ఉపాధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓ శేషాద్రి సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర, ముల్కనూర్, ఎర్రబెల్లి గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని తనిఖీ చేసి, అమలవుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ...