న్యాయమూర్తిగా మల్లారం యువకుడు డ్యాగల సాయి పవన్ ఎంపిక

భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): పట్టుదల, కృషితో న్యాయరంగంలో వరుస విజయాలు సాధిస్తూ మల్లారం గ్రామ యువకుడు డ్యాగల సాయి పవన్ గుర్తింపు పొందారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన ఆయన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్షలో అర్హత సాధించారు. నాలుగు రోజుల క్రితమే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) నియామక పరీక్షలోనూ అర్హత సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి పవన్ తొలుత హుజూరాబాద్ సమీపంలోని సింగపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రంపై ఆసక్తితో న్యాయవిద్యను ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ...