ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు!

సిర్పూర్ (యు), అక్టోబర్‌ 15 (ప్రజానేస్తం జ్వాల): ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తూ, గ్రామాల్లో మౌలిక వసతుల నిర్మాణాలను అడ్డుకుంటే సహించేది లేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) అటవీ శాఖ అధికారులను హెచ్చరించింది. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు గురువారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు. చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సమితి జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్...