14 రివార్డుల విజేత.. ఏఆర్ ఎస్ఐ గోపి కన్నుమూత
మహబూబాబాద్, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల) : మహబూబాబాద్ జిల్లా వాసి, రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు (సి) గుజిలితండాకు చెందిన గోపి 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అంకితభావం, ప్రతిభతో ముందుకు సాగుతూ హెడ్ కానిస్టేబుల్గా, అనంతరం ఏఆర్ ఎస్ఐగా పదోన్నతి పొందారు. తన సర్వీసులో వీఐపీ బందోబస్తు, ఎన్నికల విధులు వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. విధి నిర్వహణలో కనబరిచిన ప్రతిభకు...