అనంతపురం రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో దారుణం
పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. చేయి తెగి, గొంతుకు తీవ్ర గాయాలు! అనంతపురం,అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. పదో తరగతి తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ యువకుడు విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో బాలిక చేయి తెగిపోగా, గొంతుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. పాఠశాల నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన వ్యక్తే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఉపాధ్యాయులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే నిందితుడి వివరాలు,...